ఉత్తర సిక్కిం ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ అదృశ్యaమైంది

సౖనిక హెలికాప్టర్ ‘ధ్రువ్’ గురువారం ఉత్తర సిక్కింలోని చైనా సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అడవిలో కనిపించకుండా పోయింది. ఇందులో ఇద్దరు పైలట్లు, ఇద్దరు జవాన్లు ఉన్నారు. సాధారణ శిక్షణలో భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురిలోని సేవాక్ రోడ్‌బేస్ నుంచి బయలుదేరిన ధ్రువ్ ఉదయం 10.30 గంటలకు చైనా సరిహద్దులో అదృశ్యమైందని సైనిక వర్గాలు వెల్లడించాయి. 11.30 గంటలకు దీనితో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నాయి.ప్రస్తుతం ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో గాలింపును నిలిపివేశారు

Leave a Comment