రాష్ట్రంలో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు | కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సగటుకు పడిపోయాయి. ద్రోణి ప్రభావం అధికంగా ఉన్న తెలంగాణ, ఉత్తర కోస్తాలో వాతావరణం మేఘావృతమై అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిశాయి. ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి హరి సుబ్బారావు తెలిపారు.

Leave a Comment