వైఎస్ కుటుంబ సభ్యులందరూ ప్రచారం ప్రారంభించారు

కడప జిల్లాలో ఉప ఎన్నికల సమరం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ కుటుంబ సభ్యులందరూ ప్రచారం ప్రారంభించారు. బుధవారం వైఎస్ జగన్మోహనరెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించగా ఆయన తల్లి విజయమ్మ తొలిసారిగా లింగాల మండల పరిధిలోని పార్నపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ భార్య భారతిరెడ్డి తొండూరు మండలంలో పర్యటించారు. జగన్ సోదరి షర్మిళ మొదటిసారి వేంపల్లెలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తన తల్లికి, సోదరునుకి ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు. జగన్ మామ ఇ.సి.గంగిరెడ్డి వేముల మండలంలో ప్రచారం కొనసాగించగా, మేనమామ మాజీమేయర్ రవీంద్రనాథరెడ్డి కడపలో శ్రీకారం చుట్టారు.

Leave a Comment