చిరంజీవి అల్లుడు శిరీష్‌కు ముందస్తు బెయిలు నిరాకరణ

వరకట్న వేధింపుల కేసులో ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి చిన్న అల్లుడు జి.ఆర్.శిరీష్ భరద్వాజ్ పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. బెయిలు పిటిషన్‌పై జస్టిస్ బి.శేషశయనారెడ్డి విచారణ చేపట్టారు. తన భార్య శ్రీజ ఆరోపణల్లో వాస్తవం లేదని పిటిషనర్ తరఫున ఆయన న్యాయవాది తెలిపారు. ప్రేమ వివాహం జరిగి మూడేళ్లయినా చిన్న గొడవ కూడా తమ మధ్య చోటుచేసుకోలేదన్నారు. మొదటి నుంచి తమ వివాహానికి ఇష్టపడని చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే శ్రీజ తొందరపడి ఫిర్యాదు చేశారన్నారు. చర్చ ద్వారా సమస్య పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించాలని కమిషనర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి ముందస్తు బెయిల్ దరఖాస్తును కొట్టివేశారు.

Leave a Comment